home page sliderHome Page SliderTelangana

నన్ను నిర్దోషిగా తేల్చిన న్యాయవ్యవస్థకు స్పెషల్ థాంక్స్..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. గాలి జనార్దన్‌ రెడ్డి, బి.వి. శ్రీనివాసరెడ్డిని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. సబితా ఇంద్రారెడ్డిని, కృపానందను నిర్దోషిగా తేల్చింది. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మొదటగా నన్ను నిర్దోషిగా తేల్చిన న్యాయవ్యవస్థకు ప్రత్యేక ధన్యవాదాలు. 12 ఏళ్ల కిందట కన్నీళ్లతోనే ఈ కోర్టు మెట్లు ఎక్కాను. ఇన్నేళ్లు నేను ఎన్నో అవమానాలు భరించాను. ఏ ఎన్నికలు వచ్చినా నాపై అవినీతి ముద్ర వేసే వారు. నాపై ఎన్ని విమర్శలు చేసినా నన్ను నమ్మి నా వెంట నడిచిన నా నియోజకవర్గ, జిల్లా ప్రజలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. –