‘తెలుగువారు నన్ను క్షమించండి’..కస్తూరి
తాను సభలో మాట్లాడిన మాటలు తెలుగువారిని బాధపెట్టి ఉంటే తనను క్షమించాలని నటి కస్తూరి కోరారు. తాను తెలుగుకు సంబంధించిన మాటలన్నీ ఉపసంహరించుకుంటున్నానని పేర్కొన్నారు. తాను కావాలని తెలుగువారిని ఏమీ అనలేదని, తన మాటలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు లోనయ్యాయని బాధను వ్యక్తం చేశారు. తాను జాతీయవాదినని, ఏ ప్రాంతాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కస్తూరి తెలుగువారు దాసీలుగా తమిళనాడుకు వచ్చారని, ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో ముఖ్యపాత్ర వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే రజనీకాంత్, నయనతారలపై కూడా కస్తూరి వ్యాఖ్యలు చేశారు.