త్వరలో భారత్…లాక్ డౌన్ ?
కరోనా నేపథ్యంలో ప్రపంచానికి పదే పదే బలంగా వినిపించిన మూడే మూడు మాటలు….ఒకటి లాక్ డౌన్, రెండు మాస్క్.మూడు సామాజిక దూరం.మళ్లీ మూడేళ్ల తర్వాత వీటిని పదే పదే వాడాల్సిన పరిస్థితి త్వరలో దాపురించబోతుంది. కరోనా మహమ్మారిని మించిన మహమ్మారి చైనాలో ఇటీవలే పుట్టింది.దాని పేరు HMPV వైరస్.ఇప్పటికే చైనాలో లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ బారీన పడ్డారు.దీని మూలాలు ఇండియాలోకి సోమవారమే ప్రవేశించాయి.బెంగళూరులో రెండు కేసులు,అహ్మదాబాద్‌లో మరో కేసు ఇవాళ ఒక్క రోజే నమోదవడం గమనార్హం.దీంతో కేంద్ర ప్రభుత్వం అన్నీ రాష్ట్రాల సీఎంలు,సీఎస్‌లను అలెర్ట్ చేసింది.సాధ్యమైనంత వరకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను విస్తృత పరచాలని సూచించింది.