‘త్వరలో నేనే సీఎం’..కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం త్వరలోనే కూలిపోతోందని జోస్యం చెప్పారు కేంద్ర మంత్రి కుమార స్వామి. 2028లో జరగబోయే ఎన్నికలలో తానే మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి ఆ పార్టీ అంతర్గత కలహాలే కారణమవుతాయని చెప్పారు. ప్రజలు తనను ఐదేళ్లు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉండేలా ఆశీర్వదించాలన్నారు. గతంలో ఫిబ్రవరి 2006 నుండి అక్టోబర్ 2007 వరకూ, తిరిగి మే 2018 నుండి జూలై 2019 వరకూ రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు.

