Home Page SliderNational

సోనూసూద్ విత్ కుమారీ ఆంటీ

“మీది మొత్తం 1000 అయ్యింది,2 లివర్లు ఎక్స్‌ట్రా”అనే డైలాగ్‌తో ఫుడ్‌స్టాల్ కుమారీ ఆంటీ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. కాగా ప్రముఖ నటుడు సోనూసూద్ ఇవాళ కుమారీ ఆంటీని కలిశారు. ఈ క్రమంలో కుమారి ఆంటీతో సరదాగా మాట్లాడిన సోనూసూద్ వారి కుటుంబ సభ్యులను అభినందించారు. సోనూసూద్ మాట్లాడుతూ..మహిళా సాధికారిత,కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని కొనియాడారు.ఈ సందర్భంగా కుమారీ ఆంటీ మాట్లాడుతూ.. సోనూసూద్ లాంటి గొప్ప వ్యక్తి తనను కలవడానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసిన సోనూసూద్‌కు ఏమి ఇచ్చినా తక్కువేనని కుమారీ ఆంటీ ప్రశంసించారు. అయితే తనకు కష్టం వచ్చినప్పుడు సోనూసూద్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారని కుమారీ ఆంటీ వెల్లడించారు.

https://www.facebook.com/watch/?v=847202100101768