Home Page SliderNational

మహిళా రైతులతో కలిసి డ్యాన్స్ చేసిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చాలా రోజుల తర్వాత మహిళా నేతలతో సరదాగా గడిపారు. కాగా ఇటీవల రాహుల్ గాంధీ హర్యానా సోనిపాట్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాహుల్ గాంధీ అక్కడి రైతులతో మాట్లాడారు. అయితే ఈ క్రమంలోనే అక్కడి కొందరు మహిళా రైతులు ఢిల్లీలోని మీ ఇంటిని చూడాలని ఉందని రాహుల్‌ను కోరారు. వారి కోరిక మేరకు రాహుల్ గాంధీ నిన్న ఆదివారం వాళ్లను తమ ఇంటికి ఆహ్వానించారు.కాగా ఈ క్రమంలో మహిళా రైతులతో కలిసి సోనియా గాంధీ సరదాగా గడిపారు. అయితే ఆ సమయంలో సోనియాతో పాటు రాహుల్,ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..బాగా వైరల్ అవుతోంది.