మంత్రి కొండా సురేఖకు సోనియాగాంధీ అభినందనలు..
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అగ్రనేత నుండి అభినందనలు లభించాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా మంత్రి సురేఖకు లేఖ రాశారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి మహా కుంభాభిషేకం చక్కగా నిర్వహించినందుకు ప్రశంసించారు. అలాగే అక్కడి త్రివేణి సంగమం జలాలకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఇటీవల సోనియాగాంధీకి కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి స్థల విశిష్టతను, ప్రశస్థను తెలియజేసి, ప్రసాదాన్ని, త్రివేణి సంగమ పవిత్ర జలాలలను పంపించారు. ఈ సందర్భంగా సురేఖను అభినందిస్తూ లేఖ రాశారు సోనియా గాంధీ.

