స్విమ్మింగ్‌లో 5 రికార్డులు సాధించిన హీరో మాధవన్ తనయుడు
ప్రముఖ తమిళ హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ ‘మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్’లో ఏకంగా ఐదు గోల్డ్‌మెడల్స్ సాధించాడు. వరుసగా 50 మీటర్లు, 100, 200, 400, 1500 మీటర్ల కేటగిరీలలో విజయం సాధించి గోల్డ్‌మెడల్స్ గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని హీరో మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. భగవంతుని దయ, అభిమానుల ఆశీస్సులతో వేదాంత్ ఈ విజయాలు సాధించాడని, రెండు పర్సనల్ బెస్ట్ రికార్డులు కూడా నమోదు చేసుకున్నాడని పేర్కొన్నారు. ‘సఖి’ సినిమాతో అమ్మాయిల మనసు దోచుకున్న డ్రీమ్ బాయ్ మాధవన్ కుమారుడు ఇంతటి విజయాలు సాధించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

