ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో అవినీతి పెరిగిపోయిందంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిధులతోనే ఏపీలో పాలన జరుగుతోందని విమర్మించారు. డబ్బు కేంద్రానిది, కానీ ప్రచారం మాత్రం వైసీపీది అని వ్యాఖ్యానించారు. ల్యాండ్ మైనింగ్ , లిక్కర్ , శాండ్ మాఫియాలు ఎక్కువయ్యాయనన్నారు. ఏపీలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని ఆక్షేపించారు. సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు. ఏపీలో అధికార యంత్రాంగం విఫలమైందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం పై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.