Andhra PradeshBreaking NewsHome Page Slider

సోమిరెడ్డి అవినీతి పుట్ట ..కాకాణి సంచలన వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ నేత, మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. సోమిరెడ్డి అవినీతి పుట్ట అని, వీఓఏ, స్విఫ్ట్ ఆపరేటర్, రేషన్ డీలర్లు వంటి  పోస్టులు అమ్ముకుంటున్నాడని ఆరోపించాడు. అధికారంలో ఉంటే బెదిరించి డబ్బు వసూలు చేస్తాడని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసేవాడని ఎద్దేవా చేశారు. చివరికి ఔట్ సోర్సింగ్ పోస్టులు కూడా అమ్ముకుంటున్నాడని విమర్శించారు. ఏపీ జెన్‌కో బల్కర్ల నుండి కూడా ఒక్కొక్క లక్ష చొప్పున వసూలు చేస్తున్నాడనీ ఆరోపించారు. ఇలాంటి అడ్డగోలు పనులు సహించలేమని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులు నమోదు చేస్తే భయపడేవాళ్లం కాదని హెచ్చరించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి తీరును భర్తృహరి పద్యంలో చెప్పినట్లు ఇసుకలో తైలాన్ని తీయగల గొప్పవాడని ఎద్దేవా చేశారు.