Andhra PradeshHome Page SliderNews Alert

సీఎం జగన్‌తో సోమేశ్‌కుమార్‌ భేటీ

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో సుమారు గంట సేపు ముఖ్యమంత్రితో మాట్లాడారు. సోమేశ్‌కుమార్‌తోపాటు ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి కూడా ఉన్నారు. సీఎం భేటీకి ముందు జవహర్‌ రెడ్డితో కలిసి సీఎం జగన్‌కి కలవడానికి ఒకే కారులో వెళ్లారు. గురువారం ఉదయం విజయవాడ చేరుకున్న సోమేశ్‌ కుమార్‌ ఎయిర్‌ పోర్టులో మీడియాతో మాట్లాడారు. డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీలో రిపోర్ట్‌ చేయడానికి వచ్చినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధమని చెబుతూనే… ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని అన్నారు.

సోమేశ్‌ కుమార్‌ క్యాడర్‌ విషయంలో క్యాట్‌ ఆదేశాలను హైకోర్టు కొట్టేయడం, ఆ వెంటనే తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేశ్‌ను రిలీవ్‌ కావాలని డీవోపీటీ సూచించడం చక చకా జరిగిపోయాయి. రెండు రోజుల్లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలని డీవోపీటీ ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో గురువారం ఉదయం సోమేశ్‌ కుమార్‌ విజయవాడ చేరుకున్నారు. సచివాలయంలో ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసి, జాయినింగ్‌ రిపోర్టు అందించారు.