సీఎం ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ బాధ్యతల స్వీకారం
ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్‌లో అర్చకులు పూజలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమేష్ కుమార్‌కు సచివాలయంలోని అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.


