‘పవన్‌కి, చంద్రబాబుకు ఎవరైనా చెప్పండి’.. ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు..
హిందీ భాష వివాదం తమిళనాడులో మొదలై దక్షిణాదిని ఊపేస్తోంది. ఈ సమయంలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. స్వతహాగా కన్నడ నటుడైనా తెలుగు, తమిళ చిత్రాలలో కూడా చక్కగా మాట్లాడుతూ మంచి నటుడన్న గుర్తింపు పొందారు ప్రకాశ్ రాజ్. హిందీ వివాదంపై జనసేన సభలో పవన్ స్పీచ్‌నుద్దేశించి తన అభిప్రాయాన్ని ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు ప్రకాశ్ రాజ్. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు.. “ స్వాభిమానంతో మా మాతృభాషను తెలుగు, తమిళ్, కన్నడ భాషలను, మా తల్లిని, మాతృభాషను కాపాడుకోవడం”.. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు నాయుడుకి ఎవరైనా చెప్పండి అంటూ ప్రకాష్‌రాజ్ ట్వీట్ చేయడం సినీ వర్గాలలో ఆసక్తి రేపుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం హిందీ నేర్చుకోవడం తప్పేం లేదంటున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకూ స్పందించలేదు.

