Home Page SliderTelangana

‘తెలుగు రాష్ట్రాలు రెండూ గొడవ పడుతుంటే చూడాలని కొందరనుకుంటున్నారు’..చంద్రబాబు

‘తెలుగు రాష్ట్రాలు రెండూ గొడవ పడుతుంటే చూడాలని కొందరనుకుంటున్నారు’ అంటూ చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కోసం ఆయన హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియానుద్దేశించి మాట్లాడారు.  “రెండు రాష్ట్రాలు వేరైనా, ఎవరి పాలన వారిదైనా, ఎవరైనా మన తెలుగు వారి జోలికి వస్తే మాత్రం, మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలి. రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవాలని కొంత మంది కోరుకుంటున్నారు. వాళ్ళ ధోరణి మారాలి. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేనే లేఖ రాసాను.. తెలంగాణా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.  తెలుగు వారు ఐకమత్యంగా ఉండాలి. ఈ తెలుగు జాతి నాకు ఎంతో ఇచ్చింది.. మళ్ళీ జన్మంటూ ఉంటే, తెలుగు గడ్డ పైనే పుట్టాలని దేవుడిని కోరుకుంటున్నా”.. అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ టీడీపీ నేతను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.