NationalNews Alert

సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ హైవేలు రాబోతున్నాయి : గడ్కరీ

ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణం తీసుకుంది. సోలర్ ఎనర్జీ సాయంతో హైవేలపై బస్సులు, ట్రక్కులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఇండో-అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

ఎలక్ట్రిసిటీతో నడిచే విధంగా దేశ రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మిస్తున్నామని, జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో సోలర్ ఎనర్జీని వినియోగించేలా ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఎలక్ట్రిట్ హైవేలను సులువుగా చెప్పాలంటే ఇవి రైల్వే లైన్లను పోలి ఉంటాయి. రైళ్లు నడిచేటప్పుడు ఏవిధంగా అయితే అలానే హైవేలపై వెళ్లే వాహనాలు కూడా ఇలానే విద్యుత్ లైన్లను వినియోగించుకుని వాహనంలోని బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటాయి. అయితే ఇక్కడ సోలర్ ఎనర్జీని వినియోగించుకుంటాయి. ప్రధాన కారిడార్‌లో ఏ రూట్‌లో ఈ ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోందని నితిన్ గడ్కరీ వివరించారు