HealthInternational

ఈ పండుతో ఇన్ని లాభాలా.. ?

అరటిపండ్లు రుచిగా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్ని మనకు తెలుసు. కానీ ఇది తింటే ఏమవుతుందో తెలిస్తే ఈ పండుతో ఇన్ని లాభాలా? అని ఆశ్చర్యపోక తప్పదు. అరటిపండులో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్ ఉండడం వల్ల ఇది ఆరోగ్యాన్ని చాలా మంచిది. అరటిపండు తినడం వల్ల శరీరంలోని అనేక రకాల వ్యాధులను దూరం చెయ్యగలం. సీజన్‌ తో అవసరంలేని పండుంటే ఇదే అని చెప్పవచ్చు . అరటిపండులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది,మెగ్నీషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. రోజు కి ఒక గ్లాస్ పాలు ఒక అరటి పండు తింటే బలహీనమైన ఎముకలను బలంగా చెయ్యడానికి సహాయపడుతుంది. ప్రేగు పనితీరు, జీర్ణక్రియ ఆరోగ్యానికి ఇది సహాయం చేస్తుంది. అరటిపండ్లు లో ఉన్నా ఫైబర్, విటమిన్లులు చాలా సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అరటిపండ్లలో విటమిన్ B6 కూడా ఎక్కువగా ఉండడం వల్ల బ్రెయిన్ కూడా చాల చురుకుగా పని చేస్తుంది అని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.