HealthHome Page Slider

నల్ల ఉప్పు వాడడం వల్ల ఇన్ని లాభాలా…!

సాధారణంగా మన ఇళ్లల్లో తెల్లగా ఉండే సాధారణ ఉప్పుని వాడతాం. కానీ నల్ల ఉప్పుని వాడడం వల్ల కూడా చాలా లాభాలే ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు .

అవి ఏంటి అంటే, సాధారణ సాల్ట్ కంటే కూడా నల్ల ఉప్పు వాడడం వల్ల వంట రుచి బాగుంటుంది. టేబుల్ సాల్ట్ తో పోల్చితే ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. దీనివల్ల హై బీపీ తగ్గుతుంది. దీనిలో ఉండే మినరల్ కంటెంట్ వల్ల చర్మం, జుట్టుకు ఉండే సమస్యలు దూరమవుతాయి. అంతే కాదు జీర్ణక్రియ మెరుగవుతుంది. దీని వాళ్ళ గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది.

ఈ నల్ల ఉప్పులో మూడు రకాలు ఉన్నాయి.

వాటిలో ఒకటి హిమాలయ నల్ల ఉప్పు. దీనిని కాల నమక్ అని కూడా అంటారు. ఇది ఘాటుగా, రుచిగా ఉంటుంది. ఈ ఉప్పుని చాలా మంది వంటల్లో వాడుతుంటారు.

రెండవది, బ్లాక్ రిచువల్ సాల్ట్. ఇది నల్లగా కాస్త బూడిద రంగులో ఉంటుంది.

ఇక మూడవది, బ్లాక్ లావా సాల్ట్. ఇది హవాయి నుండి వస్తుంది కాబట్టి దీనిని హవాయి బ్లాక్ సాల్ట్ అని కూడా అంటారు. ఇది కొంచెం మట్టి రుచిని కలిగి ఉంటుంది.