అమెరికాను కప్పేస్తున్న మంచు తుఫాన్లు..వీడియోలు వైరల్
అమెరికాలోని పలు రాష్ట్రాలలలో భారీ స్థాయిలో మంచు వర్షం కురుస్తోంది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది ఈ దశాబ్దంలోనే అతి తీవ్రమైన శీతల తుపాన్ సంభవించ అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తాజాగా యూటాలోని కాటన్ వుడ్ కాన్యన్‌లో మంచు తుఫాన్ దూసుకువచ్చిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని పోలార్ వర్టెక్స్ అంటారు. అంటే ధ్రువపు సుడిగుండాలు అనవచ్చు. గంటకు ఐదు నుండి 12 అంగుళాల తీవ్రతతో మంచు కురుస్తోంది. వర్జీనియా, కాన్సాస్, కెంటకీ, ఆర్కాన్సాస్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఎమర్జెన్సీ విధించాయి. అమెరికాలోని 15 రాష్ట్రాలలో తీవ్ర మంచుతుపాన్లు, అవలాంచీలు విరుచుకుపడుతున్నాయి. వీటి వల్ల దాదాపు 3 కోట్ల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారని అంచనా.

