Home Page SliderNationalNews Alert

జర్నలిస్టును బెదిరించిన స్మృతి ఇరానీ.. వీడియో వైరల్‌..

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓ జర్నలిస్ట్‌పై ఆమె మండిపడ్డారు.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది. దీనిని కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి కేంద్రమంత్రిపై విమర్శలు గుప్పించింది. మీడియాపై స్మృతి ఇరానీ బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గమైన అమేఠీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని జర్నలిస్ట్‌లు పలు ప్రశ్నలు సంధించారు. అయితే.. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్‌పై ఆమె మండిపడ్డారు. తన నియోజకవర్గ ప్రజలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజక వర్గ ప్రజలను అవమానిస్తే తాను ఊరుకోనేది లేదన్నారు. దీనికి జర్నలిస్ట్‌ బదులిస్తూ.. నేను ఎవర్నీ కించపర్చట్లేదు.. మీ చర్యల గురించి ప్రశ్నిస్తున్నాను అంతే.. మీకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా లేరని అన్నాడు. దీనికి ఆగ్రహించిన కేంద్రమంత్రి మరోసారి నా నియోజకవర్గ ప్రజలను అవమానిస్తే చూస్తూ ఉండను. మీకు ప్రజలను కించపర్చే హక్కులేదన్నారు. మీరు పెద్ద రిపోర్టర్‌ కావొచ్చు. కానీ ఇంకోసారి ఇలా చేస్తే మీపై అధికారికి ఫోన్‌ చేయాల్సి వస్తుందన్నారు. వాళ్లే అన్నీ చూసుకుంటారు జాగ్రత్త.. అని హెచ్చరించారు.