నిర్మాణంలోనే కూలిన ఆరంతస్తుల భవనం..
భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కూలడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈప్రమాదంలో పలువురు మరణించారు. భవన శిథిలాల కింద కూడా ఇంకా నలుగురు చిక్కుకున్నారని స్థానికులు చెప్తున్నారు. నగరంలోని సూపర్ బజార్ సెంటర్‌లో ఉన్న ఆరంతస్తుల భవనం స్లాబ్ నిర్మాణం జరిగింది. ఇది నేటి మధ్యాహ్న వేళ హఠాత్తుగా కుప్పకూలింది. పాత భవనం పైనే మరో నాలుగంతస్తుల నిర్మాణం చేపట్టారు. ట్రస్ట్ పేరుతో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఈ కూలిన భవనం పక్కనే ఆలయ నిర్మాణం కూడా జరుగుతోంది. నిర్మాణంలోని లోపాల వల్లే భవనం కూలిందని భావిస్తున్నారు. క్రేన్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.