Home Page SliderNational

భారత్‌లో ఆరు లక్షల ఉద్యోగాలు..యాపిల్ బంపర్ ఆఫర్

యాపిల్‌ఫోన్లకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాను వదిలి ఇప్పుడు భారత్ బాట పట్టింది యాపిల్ కంపెనీ. భారత్‌లో యువత ఎక్కువగా ఉండడంతో మార్కెటింగ్‌కు మంచి అవకాశాలుంటాయని భావిస్తోంది కంపెనీ. ఫాక్సకాన్ సహాయంతో  భారత్‌లో 6 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ వెల్లడి చేసింది. తమిళనాడులో ఐఫోన్ ప్లాంట్లలో సిబ్బందికి ఐఫోన్ 16ప్రొ, ప్రొమాక్స్ వెర్షన్ల తయారీపై శిక్షణ ఇస్తున్నామని తెలిపింది. పెద్ద ఎత్తున ఫోన్ల తయారీకి భారత్‌ను వేదికగా చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, వాటిలో 70 శాతం మహిళలకే కేటాయిస్తున్నట్లు తెలిపారు.