Home Page SliderNational

“ఆదిపురుష్” మూవీ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సీత

సినీరంగంలో ఎన్నడూ లేని విధంగా “ఆదిపురుష్” సినిమా ప్రమోషన్స్ జరిగాయి. గతంలో సినిమా హీరో,హీరోయిన్లు వెళ్లి ప్రమోషన్స్‌లో పాల్గొనేవారు. అయితే ఆదిపురుష్ సినిమాకి మాత్రం వినూత్న రీతిలో ప్రమోషన్స్ జరిగాయి. బాలీవుడ్,టాలీవుడ్ హీరోలు ఆదిపురుష్ సినిమా టికెట్లను వేల సంఖ్యలో కొనుగోలు చేశారు. దీంతో సినిమా రంగంలో కొత్త ట్రెండ్ మొదలైంది. కాగా ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఈ ట్రెండ్‌ను ఫోలో అవుతూ..కృతి సనన్ ఢిల్లీలో ఏకంగా ఓ మల్టిప్లెక్స్ థియేటర్‌ను బుక్ చేశారట. తాను చదువుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లల కోసం ఆమె 300 టికెట్లను బుక్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ థియేటర్‌లో కృతి సనన్ విద్యార్థులు,  తన కుటుంబ సభ్యులతోపాటు కలిసి మరోసారి సినిమా చూడనున్నారు.  ఆదిపురుష్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కన్పించగా..కృతి సనన్ సీత పాత్రలో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో అలరించారు. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతోంది.