బండి సంజయ్‌కి సిట్ నోటీసులు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీక్ అంశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సిట్ బండి సంజయ్‌ని కోరింది. ఇటీవల టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాలు లీక్ కావడంతో.. ఒకే ఊరిలో ఎక్కువమందికి 100 మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. సరిగ్గా ఇలాంటి ఆరోపణలు చేసిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న ఆధారాలతో సహా రావాలంటూ సిట్ రేవంత్ రెడ్డికి స్పష్టం చేసింది.