బండి సంజయ్ అనుచరుడికి సిట్ నోటీసులు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21 ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతికి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.