Home Page SliderNews AlertTelangana

మరోసారి బండి సంజయ్‌కి సిట్‌ నోటీసులు

TSPSC  పేపర్‌ లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌కు సిట్‌ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26న సిట్‌ ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇది వరకే సిట్‌ అధికారులు బండి సంజయ్‌కు నోటీసులు పంపారు. అయితే.. పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున ఈనెల 24న హాజరుకాలేనని ఆయన సిట్‌ అధికారులకు లేఖ రాశారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు.