Home Page SliderTelangana

TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో సిట్ దూకుడు

TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్ జోరుగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఏడుగురు వ్యక్తులకు దీనిలో ప్రమేయం ఉందని తేల్చింది. ప్రధాన నిందితుడు రాజశేఖర్ స్వగ్రామం తాటిపల్లికి వెళ్లి ఎంక్వైరీలు మొదలుపెట్టారు. ఏకకాలంలో మూడుచోట్ల దర్యాప్తును ప్రారంభించారు. పరీక్షలు రాసిన రాజశేఖర్ బంధువులు ఎవరనే విషయాలు రాబడుతున్నారు. విదేశాల నుండి పరీక్షలు రాయడం, మిగిలిన ఆర్థిక వ్యవహారాల విషయాన్ని కూడా సీరియస్‌గా విచారిస్తున్నారు. పేపర్స్ ఇంకా ఎవరెవరి చేతికి చేరాయనే విషయం ఆరా తీస్తున్నారు. ఇంకా ఈ డ్రామాలో కీలక పాత్రధారి  రేణుక, ఆమె భర్త డాక్యానాయక్‌తో కలిసి రేణుక స్వగ్రామానికి కూడా పయనమయ్యారు సిట్ టీమ్. ఇంకా హైదరాబాద్ లంగర్ హౌస్ కాళీ మందిర్‌కు వెళ్లి అనుమానితులను కూడా విచారిస్తున్నారు కొందరు అధికారులు. మరో 7 గురు అనుమానితులను సిట్ కార్యాలయానికి తరలించారు.