Home Page Sliderhome page sliderTelangana

వివాదంలో సింగిల్ సినిమా ట్రైలర్

టాలీవుడ్ లో సింగిల్ సినిమా ట్రైలర్ వివాదంలో చిక్కుకుంది. మూవీ ట్రైలర్ లో హీరో శ్రీవిష్ణు శివయ్య అనడంపై వివాదం చెలరేగింది. కన్నప్ప సినిమాలో విష్ణు డైలాగ్ ను సెటైరిక్ గా చూపించారంటూ.. శ్రీవిష్ణు సింగిల్ మూవీపై కన్నప్ప టీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంచు కురిసిపోయింది అనే డైలాగ్ నూ సినిమాలో వాడడంపై అభ్యంతరం తెలిపారు. మోహన్ బాబు ఇంటి పేరు మంచు కావడంతో మరింత వివాదం ముదిరింది. మోహన్ బాబు కుటుంబాన్ని, సినిమాను వెక్కరించే విధంగా ట్రైలర్ ఉందంటూ మోహన్ బాబు, విష్ణు అభిమానులు, అనుచరులు ఫైర్ అవుతున్నారు. దీంతో శ్రీవిష్ణు మంచు కుటుంబానికి క్షమాపణ చెప్పారు.