సింగరేణి ప్రైవేటీకరణ చేయబోము
సింగరేణి ప్రైవేటీకరణ అనే ప్రశ్నే ఉండదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. 2018 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేసీఆర్ సింగరేణి ప్రైవేటీకరణ అంటూ విష ప్రచారం చేశారు తప్ప, అందులో నిజం లేదన్నారు. ఢిల్లీలోని తన ఆఫీసులో ఆయన బుధవారం వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడారు. దేశంలోని ఏ ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థనూ తాము ప్రైవేటీకరణ చేయమన్నారు. బొగ్గు గనుల వేలం ద్వారానే కేటాయించాలని, నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గనులను వేలం పాట ద్వారానే.. 300 గనులను వేలం వేసింది. ఈ నెల 21న పదో రౌండ్ వేలం హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. దీనివల్ల ప్రభుత్వాలకే ఆదాయం సమకూరుతుంది. బొగ్గు, గనుల వేలం ద్వారా ఒడిశా ప్రభుత్వానికి ఏటా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తోంది.