సింగరేణి ఉద్యోగసంఘాలు ఫైట్స్..
సింగరేణి ఉద్యోగ సంఘాల యూనియన్లు INTUC పై AITUC ఫైరయ్యింది. సింగరేణి ఎన్నికలు జరగనుండడంతో ఈ సంఘాల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి సింగరేణి షాక్ ఇచ్చింది. ఈ పార్టీ మద్దతుగా ఉన్న TBGKS ను వీడుతున్నారు కీలక నేతలు. కార్మిక సంఘం ఎన్నికలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించిందని పేర్కొన్నారు. TBGKS నుండి వలసలతో AITUC బలంగా ఉంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు లేదని తెలుస్తోంది. దీనితో సింగరేణి ఎన్నికలలో పొత్తులు ఉండవని నాయకులు స్పష్టం చేశారు. TBGKS కార్మిక సంఘమే కాదని, కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం వైపు వెళ్లి, కార్మిక సంఘాలకు ద్రోహం చేస్తున్నారన్నారు. సర్కారీ సంఘాలకు పాతరేయండని పిలుపునిచ్చారు.