ఏపి బీజెపి అధ్యక్షునిగా సింగారెడ్డి..!?
ఏపిలో బీజెపి లెక్కలు మారబోతున్నాయా…అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.బీజెపి ఆపరేషన్ ఏపిలో భాగంగా 2014 నుంచి ఎన్నిసార్లు చీఫ్‌లను మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. సోము వీర్రాజు,కన్నా లక్ష్మీనారాయణ,పురంధేశ్వరి..ఇలా మూడు సామాజిక వర్గాలతో చేసిన ప్రయోగం కమలనాథులను సంతృప్తి పరచలేకపోయింది.దీంతో ఈ సారి రెడ్డి సామాజిక వర్గంతో ప్రయోగం చేసి సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు.పురంధేశ్వరిని కేబినెట్‌లోకి తీసుకోవాలన్న తలంపుతోనో లేదా గవర్నర్‌గా పంపి టిడిపి వాసనలకు దూరం చేద్దామన్న ఆలోచనతో .. ఆమెను ఏపి బాధ్యతల నుంచి తప్పించి కొత్త అధ్యక్షున్ని నియమించాలని నిర్ణయించారన్న వార్తలొస్తున్నాయి.ఇందులో భాగంగా పలువురు పేర్లను బీజెపి అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాయలసీమకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది.ఆయనకు ఆరెస్సెస్ నేపథ్యంతో పాటు కిసాన్ మోర్చా విభాగంలోనూ విశేష కృషి చేశారన్న గుర్తింపూ ఉంది.అంతే కాదు…కాపు,కమ్మ,బీసి సామాజిక వర్గాల్లో రాయలసీమ నుంచి బలమైన పట్టున్న నాయకుడు.అంతే కాదు… కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం కూడా సింగారెడ్డికి ఉంది.దీంతో కొత్త అధ్యక్షుడిగా సింగారెడ్డిని నియమిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా బీజెపి పరిశీలిస్తున్నట్లు తెలిసింది.