వెండి రుణాలు షురూ
త్వరలోనే వెండిపై కూడా రుణాలు తీసుకునే అవకాశం రాబోతోంది. 2026 ఏప్రిల్ 1 నుండి అన్ని వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు వెండి తనఖాపై రుణాలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటి వరకూ కేవలం అసంఘటిత రంగాలలోనూ, సహకార సంఘాలలో మాత్రమే వెండి రుణం ఉండేది. తాకట్టు పెట్టే వెండి విలువ ఆధారంగా బ్యాంకులు ఇచ్చే లోన్ -టు – వాల్యూ పై రిజర్వ్ బ్యాంక్ కొన్ని పరిమితులు విధించింది.
. రూ.2.5 లక్షలలోపు రుణాలకు, వెండి మార్కెట్ విలువలో 85 శాతం రుణం లభిస్తుంది.
. రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల వరకూ వెండి విలువలో 80 శాతం రుణం లభిస్తుంది.
.రూ. 5 లక్షల పైన రుణం తీసుకోవాలంటే వెండి వాల్యూలో 75 శాతం మాత్రమే ఇవ్వొచ్చు.
వెండి నగలు, నాణేలు, ఆభరణాలపై మాత్రమే రుణం లభిస్తుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా 10 కిలోల వెండి, 500 గ్రాముల వెండి నాణేలపై మాత్రమే రుణం లభిస్తుంది.

