NTPC లాభాల్లో గణనీయమైన పెరుగుదల
ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ APR-SEP త్రైమాసికంలో రూ.5,380.25 కోట్ల లాభాలను ఆర్జించింది. 2023-24లో ఇది రూ.4,726 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయంలో గతేడాదితో పోలిస్తే తగ్గుదల కనిపిస్తోంది. రూ.45,384.64 కోట్ల నుండి రూ.45,197.77 కోట్లకు తగ్గింది. స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుండి 88.46 బి.యూనిట్లకు తగ్గగా, క్యాప్టివ్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 5.09 MMT నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది, ఇది చాలా మెరుగుదలను సూచిస్తోంది.

