చూపు లేకున్నా మైక్రోసాఫ్ట్ కొలువు
ఏ విద్యార్థికి అయిన సరే మైక్రోసాప్ట్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటే అదో పెద్ద అద్బుతమనే చెప్పాలి. చదువులో ఎంత బాగా రాణించే వారైనా సరే ఈ కంపెనీలో ఉద్యోగం దక్కాలంటే పెట్టిపుట్టాలంటారు. అలాంటిది చూపులేని వ్యక్తి సాధించడం అనేది మాములు విషయం కాదు. ఝార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాకు చెందిన సౌరభ్ ప్రసాద్ అలాంటి అద్భుతాన్ని సాధించి అందరి చూపును ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు.

ఛత్రా జిల్లా చట్టీగాడీలోంగ్ గ్రామానికి చెందిన సౌరభ్‌కు చిన్నతనం నుండి నీటికాసులు అనే కంటి జబ్బు ఉంది. వయస్సు పెరిగే కొద్ది దీని ప్రభావం పెరుగుతూ పోగా 11 ఏళ్ల వయస్సులో పూర్తిగా చూపుని కోల్పోయాడు. ఈ సమస్య వల్ల తన చదువునంతటిని బ్రెయిలీ లిపితో కొనసాగించాడు. చిన్నప్పటినుండి చదువు మీద ఉన్న ఆసక్తితో అన్ని పరీక్షల్లోను తన ప్రతిభను చాటాడు. ఢీల్లీ ఐఐటీలో సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్న చదువుతున్న సౌరభ్‌కు ప్రాంగణ ఎంపికల్లో 51 లక్షల ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సాధించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మనసుంటే మార్గముంటుందని పెద్దలు ఊరికే అన్నారా..