Home Page SliderTelangana

సిద్దిపేట: గజ్వేల్-ములుగు మండలం కొత్తూరు ఎన్నికల ప్రచారంలో ఈటల

సిద్దిపేట: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం కొత్తూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.

ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, భారీ ర్యాలీ నిర్వహించారు.

• భూములు గుంజుకోవటానికి కేసీఆర్ ఇచ్చిన నోటీసులన్నీ రద్దు చేస్తాం. ఒక్క ఎకరం కూడా పోనివ్వము.

• హైదరాబాద్ దగ్గర ఉండటం గజ్వేల్‌కి శాపం అయింది.  కేసిఆర్‌కి ఓటేసిన పాపానికి  భూములన్నీ గుంజుకుంటున్నారు.

• నేను వస్తున్నానని తెలవగానే కెసిఆర్ కామారెడ్డికి పారిపోయాడు. కెసిఆర్‌కి మీ మీద నమ్మకం లేదు.

• ఈటల రాజేందర్ పేదవాళ్ల వైపు, ధర్మం వైపు ఉంటాడు. అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడుతాడు.

•  మీరు అధికారం ఇస్తే కెసిఆర్‌నే  కాదు కేసీఆర్ జేజమ్మతో కూడా కొట్లాడతా.