తెలంగాణాలో ఎస్సై ఫైనల్ రాత పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణాలో ఇటీవల ఎస్సై ప్రిలిమ్స్ రాత పరీక్షలను TSPLRB నిర్వహించింది. కాగా అందులో అర్హత సాధించినవారికి దేహధారుడ్యపరీక్షలు కూడా నిర్వహించింది. కాగా ఇందులో కూడా అర్హత సాధించిన వారిని పోలీసు ఫైనల్ రాత పరీక్షలకు ఎంపిక చేసింది. అయితే ఈ ఫైనల్ రాత పరీక్షల షెడ్యూల్‌ను TSPLRB తాజాగా విడుదల చేసింది. కాగా ఏప్రిల్ 8,9 తేదిల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యహ్నం 1వరకు,మధ్యహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో రెండు రోజులపాటు ఈ ఎస్సై ఫైనల్ ఎగ్జామ్ రాత పరీక్షలు ఉంటాయని TSPLRB వెల్లడించింది. కాగా ఈ ఫైనల్ ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఏప్రిల్ 3 నుంచి 6 వరకు హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని TSPLRB తెలిపింది. కాగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లపై ఫోటో తప్పనిసరిగా అతికించాలని TSPLRB స్పష్టం చేసింది.