శుభ్మాన్ గిల్ రీఎంట్రీ…..
టీ20ల్లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చాడు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకుని పునరాగమనం చేశాడు. ఈ ఇద్దరికీ దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ఎంపికైన భారత జట్టులో స్థానం దక్కింది. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో గాయపడి వన్డే సిరీస్ను కూడా కోల్పోయిన గిల్ ఇప్పుడు తిరిగి వైస్ కెప్టెన్గా కొనసాగనున్నాడని బీసీసీఐ ప్రకటించింది. అయితే గిల్ తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా హార్దిక్ ఇప్పటికే తన ఫిట్నెస్ను ప్రూవ్ చేశాడు. 2025 ఆసియా కప్ ఫైనల్ నుంచి దూరమైన అతడు ఆస్ట్రేలియా పర్యటనకు కూడా అందుబాటులో లేకపోయాడు. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించిన ఈ జట్టు డిసెంబరు 9 నుంచి 19 వరకు జరుగనున్న దక్షిణాఫ్రికా టీ20 సిరీస్లో పోటీపడనుంది. ఈ సిరీస్కు కటక్, చండీగఢ్, ధర్మశాల, లఖ్నవూ, అహ్మదాబాద్ వేదికలుగా నిలుస్తాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్న ఈ జట్టులో గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్, కుల్దీప్, హర్షిత్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

