Home Page SliderNationalNews Alertviral

“తాళి తీసేసి పరీక్ష రాయాలా?”..రైల్వేపై మహిళల మండిపాటు

రైల్వే శాఖలో నర్సింగ్‌‌ సూపరింటెండెంట్‌‌ పోస్టుల భర్తీకి అధికారులు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులకు హాల్ టికెట్లు కూడా పంపించారు అయితే ఈ పరీక్ష విషయంలో పెళ్లయిన హిందూ మహిళలు మండిపడుతున్నారు. ఎందుకంటే  పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మంగళసూత్రం, చెవిపోగులు, ముక్కుపుడకలు, ఉంగరాలు, కంకణాలు, జంధ్యం వంటివి ఏవీ ధరించకూడదని హాల్‌‌టికెట్లపై పేర్కొన్నారు. హిందూ ఆచారం ప్రకారం వివాహమైన మహిళలు మంగళసూత్రాన్ని ఎల్లవేళలా ధరించాలి. తాళి కూడా తీసివేయడం కుదరదని చెప్తున్నారు.  దీనిపై వీహెచ్ పీ నేతలు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.