ATM వాహనంపై కాల్పులు.. భారీ దోపిడి
కర్ణాటకలోని బీదర్లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలో డబ్బులు జమ చేసే వాహనంపై దాడికి పాల్పడ్డారు. భారీగా నగదు దోపిడీ చేశారు. వాహనంలోని సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు మరణించాడు. మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం నగదు పెట్టెతో దొంగలు పరారయ్యారు. అందులో రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

