ప్రాణభయంతో పరుగులు తీసిన ఊరి జనం..ఎందుకంటే..
కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూర్‌పూర్ తాలూకా జాలిబెంచి అనే గ్రామం మంగళవారం రాత్రి భయంతో వణికిపోయింది. ఊరి జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. ఊహించని పరిణామం ఆ గ్రామంలో దాదాపు 100 ఇళ్లను వణికించింది. ఈ గ్రామంలో మంగళవారం రాత్రి బాగా గాలులు వీచడంతో కరెంట్ వైర్లు ఒకదానికొకటి రాచుకుని షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. గ్రామంలో కరెంట్ స్థంభాల నుండి వైర్లు ఇళ్లపై పడ్డాయి. దీనితో మంటలు చెలరేగాయి. దీనితో భయంతో ప్రజలు పరుగులు తీశారు. సమాచారం తెలిసిన విద్యుత్ సప్లై కంపెనీ సబ్ స్టేషన్‌లో విద్యుత్ ఆపి వేశారు. ఈ గ్రామానికి చేరుకుని, లైన్లను పునరుద్ధరించే పనిలో పడ్డారు. అయితే ఈ కరెంట్ సరఫరా లైన్లు ఎన్నో ఏళ్ల క్రితానివని, దానివల్లే ప్రమాదం జరిగిందని, అధికారులు స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు.

