రైల్వే బోర్డుకు షాక్..
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా 11 వేల నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. దీనికి వచ్చిన దరకాస్తులు చూసి రైల్వే బోర్డుకు షాక్ తగిలింది. కేవలం 11 వేల పోస్టులకు దేశ వ్యాప్తంగా ఏకంగా 1.21 కోట్ల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. .. భారతీయ రైల్వేలోని వివిధ జోన్‌లలో NTPC ఖాళీలను భర్తీ చేసేందుకు ఇచ్చిన ఈ నోటిఫికేషనకు ఇంత భారీ సంఖ్యలో కనీవినని రీతిలో దరఖాస్తులు రావడం విశేషం. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయితే తాజాగా ఆర్‌ఆర్‌బీ ఈ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో ఆన్‌లైన్ రాత పరీక్ష (CBT 1) నిర్వహించనున్నట్లు షెడ్యూల్ చేసింది. ఇన్ని కోట్ల మందికి దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ప్రతిరోజూ మూడు షిఫ్టులలో జరుగుతుంది.

