Andhra PradeshHome Page SliderNews AlertPolitics

వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌ వర్రాకి షాక్..

కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. వర్రాకి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జగ్గయ్యపేట పోలీసులు పీటీ వారెంట్‌పై మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పులివెందులకు చెందిన రవీందర్ రెడ్డి గత ప్రభుత్వ కాలంలో చంద్రబాబు, పవన్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టారనే ఫిర్యాదుల మేరకు అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా షేర్ మహ్మద్‌పేటకు చెందిన ఎనికే గోపి ఫిర్యాదు మేరకు చిల్లకల్లు పోలీసులు ఐటీ యాక్ట్ ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసు విషయంలో బుధవారం ఆయనను జగ్గయ్యపేట కోర్టులో ప్రవేశపెట్టారు.  న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో జగ్గయ్యపేట జైలుకు తరలించారు.