Home Page SliderNews AlertTelanganatelangana,

స్మితా సభర్వాల్‌కు షాక్..

ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ షాక్ ఇవ్వనుంది. ఆమె సీఎంవో అదనపు కార్యదర్శి హోదాలో 2016 నుండి 2024 మార్చి మధ్య 90 నెలలకు అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆమె ఈ సమయంలో వాహనం అద్దె కింద రూ.61 లక్షలు తీసుకున్నారని, దీనిపై ఆడిట్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని వర్సిటీ వీసీ ధ్రువీకరించారు. దీనితో ఆమెకు నోటీసులు ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వాహన అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలని, రెండ్రోజులలో ఆమెకు అధికారులు నోటీసులు జారీ చేయవచ్చని సమాచారం. దీనితో న్యాయ నిపుణుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.