పంజాబ్ కింగ్స్ అభిమానులకు షాక్..
ఐపీఎల్ 2025లో నేడు జరగబోతున్న క్వాలిఫయిర్ 1 మ్యాచ్‌లో పంజాబ్ అభిమానులకు షాక్ తగలనుంది. ఆర్సీబీతో జరగబోతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు నుండి స్టార్ పేసర్ మార్కో జన్సెన్ దూరమవడమే దీనికి కారణం. అంతేకాక ఈ టీమ్‌లో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కూడా గాయపడడంతో గత రెండు మ్యాచ్‌లుగా దూరంగానే ఉన్నారు. దీనితో పంజాబ్ బౌలింగ్ టీమ్ బలహీనంగా కనిపిస్తోంది. అయితే బ్యాటర్లు ఫామ్‌లోనే ఉండడం ఊరట కలిగించే విషయమే. శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య, ప్రభుసిమ్రన్ వంటి వారు చెలరేగి ఆడుతున్నారు. దాదాపు సమఉజ్జీలుగా కనిపిస్తున్న పంజాబ్ కింగ్స్, బెంగళూర్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.