మెట్రో ప్రయాణికులకు షాక్..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెట్రో సంస్థ ఎల్‌అండ్‌టీ షాక్ ఇవ్వనుంది. మెట్రోలో ప్రయాణించడానికి కనీస ఛార్జీ ధరను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న కనీస ధర రూ.10లను రూ.15 చేస్తోంది. గరిష్ట ఛార్జీని రూ. 60 నుండి రూ.75కు పెంచుతోంది. ఈ ధరల పెంపుకు అనుమతి కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు మే 8న భేటీ కానున్నారు. మే10 నుండి కొత్తఛార్జీలు అమలు చేయాలని మెట్రో ఆలోచిస్తోంది. దీనితో రోజూ మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులకు నెలవారీ బడ్జెట్ పెరగుతుందని ఆందోళన చెందుతున్నారు.