అనిల్ అంబానీకి షాక్.. సీఎఫ్వో ను అరెస్ట్ చేసిన ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. రిలయన్స్ పవర్ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ అశోక్ పాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్ట్ చేసింది. రూ.68 కోట్ల ఫేక్ బ్యాంక్ గ్యారంటీ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద ఈ అరెస్ట్ జరిగింది. దీనికి సంబంధించి ఆయనను ఢిల్లీ కార్యాలయంలో పలు ప్రశ్నలు అడిగి, అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనిల్ అంబానీ ఇప్పటికే రూ.17 వేల కోట్ల మేర రుణాల మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ పవర్ సహా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. స్పెషల్ కోర్టు అశోక్ పాల్ కు రెండు రోజుల కస్టడీ విధించగా అక్టోబర్ 13న ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.