Home Page SlidermoviesNationalNews Alert

చైతన్య లుక్‌పై శోభిత కీలక కామెంట్స్..

నాగ చైతన్య లుక్‌పై అతని సతీమణి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా నేడు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తండేల్ చిత్రంపై చూసేందుకు ఆస్తకిగా ఎదురు చూస్తున్నానని శోభిత పేర్కొంది. అంతేకాదు.. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేశారు. మొదటి సారి నీదర్శనం అవుతుంది సామీ…’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై చైతన్య స్పందిస్తూ ‘థ్యాంక్యూ బుజ్జి తల్లీ’ అని కామెంట్ పెట్టారు. ఈ చిత్రంలో నాగ చైతన్య పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్ల జైలు శిక్ష అనుభవించిన పాత్రలో తండేల్ రాజుగా నటిస్తుండగా, సాయిపల్లవి బుజ్జి తల్లిగా నటించింది. ఈ చిత్ర షూటింగ్  2023లో మొదలవగా, ఇప్పటి వరకూ గడ్డం, పొడవైన జుట్టు తోనే కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రమోషన్స్‌లో కూడా గడ్డంతోనే ఉన్నారు.