కన్న పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే వదిలేసింది..
కన్న పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మల్లాపూర్ మండలం సాతరం గ్రామానికి చెందిన నరేష్‌తో దివ్యకు వివాహం కాగా రోడ్డు ప్రమాదంలో నరేష్ మృతి చెందాడు. దీంతో వేరే వారితో అక్రమసంబంధం పెట్టుకొని తల్లి దివ్య పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న దివ్య తండ్రి మురళి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. తండ్రిని చూడడానికి వచ్చి తండ్రితో గొడవపడి ఇద్దరు పిల్లలు వదేలేసి వెళ్లిపోయింది. అమ్మమ్మ తాత వద్దనే పిల్లలు ఉన్నారు.

