‘ఆమె జింకలా పరుగుపెడుతోంది’..బీజేపీ నేత కీలకవ్యాఖ్యలు
బీజేపీ నేత రమేష్ బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. గతంలో ప్రియాంక గాంధీ బుగ్గలపై కామెంట్లు చేసిన అతడు, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని టార్గెట్ చేశారు. ఎన్నికలు రాగానే అతిషి ఢిల్లీ వీధుల్లో జింకలా పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు. ఆమె తన తండ్రిని మార్చి మర్లెనా అనే పేరు నుండి అతిషి సింగ్‌గా మారిందని ఆరోపించారు. ఆమె తల్లిదండ్రులు పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురును సమర్థించారని, వారిది భారత్ వ్యతిరేక మనస్తత్వమని అన్నారు. మరోవైపు ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్ బిదూరియేనని ప్రచారం చేస్తున్నారు. అతడు కల్కాజి నియోజకవర్గం నుండి సీఎం అతిషిపై పోటీలో ఉన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.

