Andhra PradeshHome Page Slider

సర్జరీని మధ్యలోనే ఆపేసిన డాక్టర్ల అలసత్వం

Share with

చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో సర్జరీని మొదలుపెట్టి, మధ్యలోనే ఆపేసారు వైద్యులు.  ఈ నిర్వాకం, ప్రభుత్వ డాక్టర్ల పనితీరుకు అద్దం పడుతోంది. యాదమరి మండలం దళవాయిపల్లికి చెందినది పుష్పమ్మ అనే వృద్ధురాలు డిసెంబరు 31న ఇంట్లో జారిపడింది.  తొడ ఎముక గట్టిగా తగలడంతో ఆమెను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఎక్సరేలు, ఇతర పరీక్షలు చేయించారు. అటుపై  సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. బీపీ, షుగర్ పరీక్షలు చేసి, కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచారు. చివరికి బుధవారం ఆపరేషన్ మొదలుపెట్టి, మధ్యలోనే ఆపేశారు. స్థానికంగా చికిత్స చేయలేమని, వేరే హాస్పటల్‌కు తీసుకెళ్లాలని చెప్పారు. అప్పటికే తొడ భాగాన్ని కోసి, మధ్యలోనే కుట్లు వేసేసారు. చివరకు బాధితులు గట్టిగా ప్రశ్నిస్తే ఎముకలు గట్టిగా లేవంటూ సాకులు చెప్పారు. చివరకు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయగా, న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆపై బాధితురాలిని ఆస్పత్రి వార్డులో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. దీనితో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి పోవాలంటేనే జంకుతున్నారు.