పాలేరు నుండే షర్మిల పోటీ ప్లాన్స్
పాలేరు నుండి పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన షర్మిల మళ్లీ చాలాకాలం ఊరకుండిపోయారు. ఇప్పుడు మళ్లీ పాలేరు నుండే పోటీ చేసే ఆలోచనలు చేస్తోంది. ఈమధ్యనే దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ఆవిష్కరించిన షర్మిల ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన పాదయాత్రను కూడా ఇక్కడే ముగించాలని ఆమె ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఇక్కడ అధికార బీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర బాగా ప్రచారం మొదలుపెట్టేశారు. తాను లోకల్ అని, తననెవ్వరూ ఏం చేయలేరన్న ధీమాలో ఉన్నారాయన. షర్మిల అసలు ఇక్కడి మనిషే కాదని, ఆమెకు ఇక్కడేం పని అని ఎత్తి పొడిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ టికెట్లు ఇస్తారని మాట ఇచ్చారని, ధీమాగా ఉన్నారు కందాల. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనుందా, లేక వైఎస్సార్‌టీపీ నుండే పోటీ చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. వైఎస్సార్ సానుభూతిపరులు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉండడంతో ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.